ETV Bharat / state

ఒకప్పుడు ఎగతాళి చేశారు.. ఇప్పుడు ఆమె ఆదర్శం

కుటుంబ పరిస్థితులు సహకరించకున్నా ఊరికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో వాలీబాల్‌ క్రీడాకారిణిగా ఎదిగిందా అమ్మాయి. చిన్నతనంలో ఊర్లో జరిగిన ఓ ఊరేగింపుతో స్ఫూర్తి పొంది క్రీడల్లో రాణించాలని.. ఆ దిశగా అడుగులు వేసింది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ.. అంతర్జాతీయ సబ్‌ ఏషియన్‌ అండర్‌-20 వాలీబాల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. చిన్న వయసులోనే అనేక సవాళ్లు అధిగమించిన వాలీబాల్‌ క్రీడాకారిణి చందూలావణ్య కథ ఇది.

volleyball player Chandulavanya
volleyball player Chandulavanya
author img

By

Published : Jul 30, 2022, 6:04 AM IST

వాలీబాల్‌ క్రీడాకారిణి చందూలావణ్య కథ ఇది

పట్టుదలతో కృషి చేస్తే ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా లక్ష్యం చేరుకోచ్చని నిరూపించిందీ యువతి. నిరుపేద కుటుంబంలో జన్మించిన చందూ లావణ్య.. ఆటపై ఉన్న మక్కువతో అంతర్జాతీ య వాలీబాల్‌ క్రీడాకారిణిగా ఎదిగింది. కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ సబ్‌ ఏషియన్‌ అండర్‌-20లో భారత్‌ నుంచి పాల్గొన్న 14 మంది క్రీడాకారుల్లో...తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక అమ్మాయిగా నిలిచి పోటీలో తనదైన ప్రతిభ కనబర్చింది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి అంతర్జాతీయ వాలీబాల్‌ ప్లేయర్‌గా రాణిస్తున్న చందూ లావణ్యది మహబూబాబాద్‌ జిల్లా జయపురం స్వస్థలం. తండ్రి దివ్యాంగుడు కావడంతో తల్లి కూలీ పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. అలాంటి దుర్భర పరిస్థితులు చూసిన లావణ్య ఎలాగైనా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్మల కష్టాలను దూరం చేయాలనుకునేది.

టాలెంట్ ఉన్న చాలా మంది ఉన్నారు. కానీ సపోర్ట్ చేసేవాళ్లు ఉండరు. తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే... చాలా మంది క్రీడాకారులు బయటకు వస్తారు. నాలాగా ఎంతో మంది ముందుకు వెళ్లాలి. మా నాన్న ఆశించేది నేను మంచి స్థాయిలో ఉండాలి అనుకున్నారు. అది నేను నేరువేర్చుతా... నాడ్రీమ్​లో 50 శాతం పూర్తి అయింది.. ఇంకా ముందు ముందు సీనియర్ ఇండియా కచ్చితంగా ఆడుతా... మా సార్​ కూడా చాలా సపోర్ట్ చేశారు. - చందూ లావణ్య, అంతర్జాతీయ వాటీబాల్ క్రీడాకారిణి

క్రీడల పట్ల ఆసక్తి లేనప్పటికి విశ్రాంత క్రీడోపాధ్యాయుడు వీరారెడ్డి నిర్వహించిన వాలీబాల్‌ శిక్షణ శిబిరానికి వెళ్లేది లావణ్య. అంతకు ముందు అదే గ్రామానికి చెందిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సిక్కిరెడ్డికి అర్జున అవార్డు రావడంతో గ్రామస్థులు ఆ అమ్మాయి విజయాన్ని ఒక వేడుకలా నిర్వహించి ఊరేగింపు చేశారు. అప్పటి వరకు వాలీబాల్‌ను ఆటవిడుపుగా చూసిన లావణ్య తన కళ్ల ముందు జరిగిన ఊరేగింపు... ఆ క్రీడాకారిణికి లభించిన గౌరవంతో... ఎప్పటికైనా ఆ స్థాయికి ఎదగాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదే సంకల్పంతో అప్పటి వరకు బాల్‌ అందించడానికే పరిమితం అయిన యువతి నాటి నుంచి ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటుగా శిక్షణ తీసుకోలేని లావణ్య.. ఇంటర్‌లో కరీంనగర్‌ జిల్లా చింతకుంటలోని గురుకుల జూనియర్‌ కళాశాలలోవాలీబాల్‌ శిక్షణ అందిస్తున్నారని తెలుసుకొని అక్కడ చేరింది. శిక్షణ సమయంలో కుటుంబ సభ్యులు ప్రోత్సహించే వారు కాదని జాతీయస్థాయి లో 8సార్లు గెలిచాక వారికి తనపై నమ్మకం కలిగిందని అంటోంది లావణ్య.

నాకు ప్రాక్టీస్ కావాలని.. ఇక్కడ చింతకుంటకు వచ్చా.. ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నా... ఆ తర్వాత వైజాగ్​లో జాయిన్ అయ్యాను. ఇంటర్ సెకండియర్​కు వచ్చా... ఆ తర్వాత కజకిస్తాన్ అవకాశం వచ్చింది. పాస్ పోర్ట్ లేకుండే. డబ్బులు కూడా లేవు. అప్పుడు మా గురువు వీరారెడ్డి సపోర్ట్ ఇచ్చి... కజకిస్థాన్​కు పంపించారు. - చందూ లావణ్య, అంతర్జాతీయ వాటీబాల్ క్రీడాకారిణి

జాతీయ స్థాయిలో గెలిచిన తనకు సబ్‌ ఏషియన్‌ అండర్‌ 20 టోర్ని ఒక సదావకాశంలా మారిందని అంటోంది లావణ్య. భారత్‌ నుంచి ఎంపికైన 14 మందికి భువనేశ్వర్‌లో రెండు నెలల పాటు శిక్షణను అందుకున్న తర్వాత పోటిల్లో పాల్గొనేందుకు తన గురువు వీరారెడ్డి సహాయంతో కజికిస్థాన్‌కు పయనమైంది. కజికిస్థాన్‌లో జరిగిన పోటీల్లో 6 జట్లతో పోటీపడ్డ భారత బృందం రెండు మ్యాచులు గెలవగా మరో 4 మ్యాచ్‌లు కొద్దిపాటి తేడాతో ఓటమిపాలైంది. ఓటమి చెందినందుకు బాధపడినా భారత జెర్సీ ధరించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెబుతోంది లావణ్య. ఇలా.. వాలీబాల్ పట్ల ఆసక్తి ఉండి... ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారి కోసం ప్రభుత్వం సహాయం అందిస్తోందని చెబుతున్నారు... గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. తమవద్ద శిక్షణ పొందుతున్న బాలిక అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని గురుకుల పాఠశాల సిబ్బంది, శిక్షకులు అంటున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో లావణ్య రాణించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్లను తయారు చేయడమే మా లక్ష్యం. ఇంకా చాలా మందిని తయారు చేస్తాం. - థెరిస్సా, ప్రిన్సిపల్‌, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

ఇక్కడ జాయిన్ అప్పటి నుంచి తను అన్నిట్లో ఫాస్ట్​గా ఉండేది. డైలీ ప్రాక్టీస్ చేస్తూ... అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఇంకా తను సాధించాలని కోరుకుంటున్నా... తనని ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది పిల్లలు ఆటల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నా... - సుజాత, పీఈటీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

ఒకప్పుడు మగరాయుళ్లా ఆటలేంటి అని ఎద్దేవా చేసేవారు ఇప్పుడు తన గెలుపును చూసి ముక్కున వేలేసుకున్నారంటున్నలావణ్య.. నేటితరం క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.