ETV Bharat / state

కరోనా బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు

author img

By

Published : Jun 13, 2021, 7:46 PM IST

కరోనా కారణంగా అనాథలుగా మిగిలిన వారిని ఆదుకునేందుకు మేమున్నామని ముందుకొస్తున్నాయి పలు స్పచ్ఛంద సేవా సంస్థలు. తమ వంతు సాయం అందిస్తూ.. వారికి బాసటగా నిలుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో కొవిడ్ బాధిత కుటుంబాలకు ఆదరణ సేవా సమితి, సర్వ్ టు సోసైటీ సభ్యులు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.

Distribution of daily necessities to corona affected families
కరోనా బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

కరీంనగర్ జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురికి ఆదరణ సేవా సమితి, సర్వ్ టు సోసైటీలు అండగా నిలిచాయి. జిల్లాలోని రామడుగు, కొత్తపల్లి మండలాల్లోని కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను ఆ సంస్థల సభ్యులు పంపిణీ చేశారు.

జిల్లాలోని రామడుగు మండలం తిర్మాపూర్ గ్రామంలో కరోనా కారణంగా కుటుంబాన్ని కోల్పోయి అనాథగా మారిన బాలికకు అండగా నిలిచారు. బాలికకు మూడు నెలలకు సరిపడా నిత్యవర వస్తువులను ఆ సంస్థల సభ్యులు అందజేశారు.

కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మృతి చెందడంతో అతని భార్యా పిల్లలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని, సర్వ్ టు సోసైటీ అధ్యక్షుడు శశాంక్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: RAITHUBANDHU: ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.