ETV Bharat / sports

రంజీ ప్రాబబుల్స్‌లో విరాట్ - పంత్‌! - Ranji Trophy Virat Kohli - RANJI TROPHY VIRAT KOHLI

Ranji Trophy Virat Kohli, Rishabh Pant : స్టార్‌ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వీరిద్దరు దేశవాళీ క్రికెట్‌లో ఆడనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుపుతూ దిల్లీ క్రికెట్ సంఘం తన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. పూర్తి వివరాలు స్టోరీలో

source ANI
Virat Kohli, Rishabh Pan (source ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 25, 2024, 12:32 PM IST

Ranji Trophy Virat Kohli, Rishabh Pant : స్టార్‌ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీగా ఉండే వీరిద్దరు దేశవాళీ క్రికెట్‌లో ఆడనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుపుతూ దిల్లీ క్రికెట్ సంఘం తన ప్రాబబుల్స్‌ను ప్రకటించడం గమనార్హం. కాగా, రీసెంట్​గా జరిగిన దులీప్‌ ట్రోఫీలోనూ కోహ్లీ ఆడకుండా మినహాయింపు ఇచ్చింది బీసీసీఐ. పంత్ మాత్రం తొలి రౌండ్‌లో ఆడి, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు.

మొత్తం 84 మందితో కూడిన ప్రాబబుల్స్‌ స్క్వాడ్‌ను దిల్లీ క్రికెట్ సంఘం తాజాగా అనౌన్స్ చేసింది. ఈ రంజీ ట్రోఫీ కోసం సెలెక్ట్ చేసిన ఆటగాళ్లకు సెప్టెంబర్ 26న ఫిట్‌నెస్ టెస్ట్ జరుగుతుంది. అయితే, ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడే ప్లేయర్స్​కు మాత్రం ఫిట్‌నెస్ టెస్టు ఉండదు. ఈ విషయాన్ని డీడీసీఏ వెల్లడించింది. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ఎలైట్‌ పోటీలు మొదలు కానున్నాయి. నవ్‌దీప్‌ సైని కూడా ఇందులో చోటు దక్కింది. కానీ గత సీజన్‌లో ఆడిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు మాత్రం ఈసారి ఛాన్స్ రాలేదు.

కాగా, రంజీ ట్రోఫీలో గతంలో దిల్లీ జట్టు తరఫున గౌతమ్‌ గంభీర్‌, శిఖర్ ధావన్‌ తదితరులు ప్రాతినిధ్యం వహించారు. విరాట్​ చివరిసారిగా 2012-13 సీజన్‌లో రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత ఇండర్నేషనల్​ క్రికెట్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. పంత్‌ కూడా 2016-17 సీజన్‌లో బరిలోకి దిగాడు. ఝార్ఖండ్‌పై కేవలం 48 బంతుల్లోనే శతకం బాది అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.

ఆడటం కష్టమే - దిల్లీ ప్రాబబుల్స్‌లో విరాట్, పంత్‌ పేర్లు ప్రకటించినప్పటికీ వీరిద్దరు ఆడటం కష్టమే. ఎందుకంటే అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఇక ఈ సిరీస్‌ తర్వాత ఐదు టెస్ట్​ల బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీ ​కోసం టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

కోహ్లీ, నీరజ్ చోప్రా - ఇప్పుడు భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే? - Most Popular Sports Person In India

'నాకు రెండు చేతులే ఉన్నాయి సార్​' - హోటల్​ సిబ్బందితో కోహ్లీ బ్యాడ్​ బిహేవియర్​! - Virat Kohli Behaviour

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.