ETV Bharat / state

డ్రైవర్​ బాబు మృతదేహాన్ని బస్టాండ్​కు తరలించేందుకు యత్నం, జేఏసీ నేతల అరెస్ట్.. - TSRTC STRIKE TODAY

డ్రైవర్​ బాబు మృతదేహాన్ని కరీంనగర్​ బస్టాండ్​కు​ తీసుకురావాలని ప్రయత్నించిన ఆర్టీసీ ఐకాస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బాబు భౌతికకాయాన్ని నేరుగా అతని స్వగృహానికి తరలించారు. ఇవాళ కరీంనగర్ బంద్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

డ్రైవర్​ బాబు మృతదేహాన్ని బస్టాండ్​కు తరలించేందుకు యత్నం
author img

By

Published : Oct 31, 2019, 7:14 AM IST

Updated : Oct 31, 2019, 7:29 AM IST

హైదరాబాద్ సకల జనుల సమరభేరి సభకు వెళ్లి గుండెపోటుతో చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ ఎన్.బాబు మృతదేహాన్ని కరీంనగర్ బస్టాండ్​కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారు. మృతదేహాన్ని కరీంనగర్-టూ డిపో వద్దకు తీసుకొచ్చేందుకు కార్మికులు తీవ్ర ప్రయత్నం చేసారు. వారిని బైపాస్ వద్దే అడ్డుకున్న పోలీసులు నేరుగా పార్థివ దేహాన్ని ఇంటికే తీసుకెళ్లాలని సూచించారు. అందుకు జేఏసీ నేతలు ఒప్పుకోకుండా డిపో వద్దకు తీసుకువెళ్లి నివాళులర్పిస్తారమని కోరారు. పోలీసులు నిరాకరించడంతో... కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జేఏసీ నేతలను అరెస్టు చేసి అంబులెన్స్​ను నేరుగా ఆరెపల్లిలోని మృతుని ఇంటికి తరలించారు. అరెస్టు చేసిన జేఏసీ నేతలను కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​కు తరలించారు.

రాత్రి నుంచే బందోబస్తు ఏర్పాటు

నిజానికి నిన్న సాయంత్రమే మృతదేహాన్ని కరీంగనగర్​కు తీసుకరావాలని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డగిస్తారన్న ఆలోచనతో తెల్లవారుజామున తీసుకొచ్చారు. రాత్రి నుంచి పోలీసులు తమను మభ్య పెట్టారని జేఏసీ నేతలు ఆరోపించారు. రాత్రి నుంచే కరీంనగర్ జిల్లా సరిహద్దులోని శనిగరం, అలుగునూరు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిపోకు తీసుకువెళ్లనీయకుండా అడ్డుకోవాలని ప్లాన్ వేసారు.

నేడు కరీంనగర్ బంద్

బాబు మృతితో ఆర్టీసీ జేఏసీ ఇవాళ కరీంనగర్ జిల్లా బంద్​కు పిలుపునిచ్చింది. తమ 27 రోజుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు మనోవేదనతో చనిపోతుంటే.. కనీసం మృతదేహాలకు నివాళులు అర్పించుకోనీయడం లేదని ఆర్టీసీ జేఏసీ ఆరోపించారు. పోలీసుల తీరుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

డ్రైవర్​ బాబు మృతదేహాన్ని బస్టాండ్​కు తరలించేందుకు యత్నం

ఇవీ చూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు

Last Updated : Oct 31, 2019, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.