కరీంనగర్- జగిత్యాల రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామశివారులో కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. కరీంనగర్ సీతారాంపూర్‌కు చెందిన ప్రభాకర్ రావు దంపతులు కొండగట్టు నుంచి కరీంనగర్ వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రభాకర్ రావు అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్య కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: ఖమ్మం జిల్లాలో కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు