Revanth Reddy Election Campaign in Telangana : గజ్వేల్ ప్రజలను మోసం చేసి కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) విమర్శలు చేశారు. అక్కడ కూడా ప్రజలు సీఎం కేసీఆర్‌ను బొందపెట్టడం ఖాయమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ(Six Guarantees)లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, మానుకొండూర్ నియోజకవర్గాల్లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మీ కోరిక నెరవేరాలన్న.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న డిసెంబరు 9 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలని జమ్మికుంటలోని ఓటర్లను రేవంత్‌రెడ్డి కోరారు. హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలనే నాతో పాటు కోదండరామ్, బల్మూరి వెంకట్ వచ్చారు. ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు.. రాజరికపు పాలన ఉండాలా వద్దా అనే అంశాన్ని తేల్చనున్న ఎన్నికలు అని అన్నారు.
దుబ్బాక నిధులను మామా, అల్లుళ్లు సిద్దిపేటకు ఎత్తుకుపోవడం అలవాటైపోయింది : రేవంత్‌రెడ్డి
Telangana Election 2023 : ఈ ప్రాంతంలో కోవర్టు నాయకులు ఎక్కువ.. కేసీఆర్(KCR)తో యుద్ధం చేసి గెలిచిన ఈటల రాజేందర్.. కేంద్రం ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తెచ్చారా అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంకొక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ పదవి కోసం కమిషన్ల కోసం పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. వారిద్దరినీ చూశారు కదా.. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే.. గతంలో ఎలా అభివృద్ధి జరిగిందో అలానే తాను దగ్గరుండి ఈ ప్రాంత అభివృద్ధికి పట్టం కడతానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు పెరిగారని.. వారంతా ఈ కురుక్షేత్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టారని అన్నారు. తెలంగాణలో పూర్తిస్థాయిలో మార్పు రావాలంటే.. దొరల పాలన పోవాలని సూచించారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. మార్పు రావాలంటే.. కాంగ్రెస్ రావాలని కోరారు.
కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌ను బొందపెట్టడం ఖాయం : ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాయకురాలు సోనియా గాంధీ.. ఆనాడు సిద్దిపేటకే పరిమితమైన కేసీఆర్.. కరీంనగర్, పాలమూరు, గజ్వేల్‌కు చేరారని మానుకొండూర్ నియోజకవర్గంలో జరిగిన సభలో రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు గజ్వేల్ ప్రజలను కూడా మోసం చేసి కామారెడ్డి(Kamareddy Fight)కి పారిపోయారని దుయ్యబట్టారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌ను బొందపెట్టడం ఖాయమని అన్నారు. రసమయి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. తెలంగాణ పాటను రసమయి దొర గడీలో తాకట్టు పెట్టిండు. కేసీఆర్ నకిలీ వంద రూపాయల నోటు లాంటివాడని.. నకిలీ నోటు జేబులో ఉన్నా దానికి విలువ ఉండని ఎద్దేవా చేశారు.
Congress Vijaya Bheri Sabha at Manukonduru : మానుకొండూర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ మండలంలో జూనియర్ కాలేజీ, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. అలాగే తోటపల్లి రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మీ ఆలోచనలు, అవసరాలు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ వేదిక నుంచి కేసీఆర్‌కు చెబుతున్నా.. బరాబర్ దొరల రాజ్యాన్ని బొంద పెడతాం.. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. మానుకొండూర్లో కవ్వంపల్లిని భారీ మెజారిటీతో గెలిపించండి.. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం అంటూ రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం : విజయశాంతి
చిన్నపాటి వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ ఆగమవుతోంది : అంజన్ కుమార్ యాదవ్