కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అకాల వర్షానికి రైతులు పండించిన ధాన్యం కొట్టుకుపోయింది. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చారు.అయితే మార్కెట్‌లో సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల ఆ ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇలా వర్షపు నీటిలో తడిసిపోవటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తడిసిన ధాన్యాన్ని సహితం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.