ETV Bharat / state

సంక్షోభంలో చిన్నారులు.. ప్రాథమిక విద్య నేర్పే దారేదీ?

కరోనా నేపథ్యంలో.. బడులు తెరుచుకోకపోగా, చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. అక్షరాలు నేర్వకుండానే సర్కారు బడుల్లోని 1వ తరగతి విద్యార్థులు.. 2వ తరగతి చదివేందుకు ప్రమోట్‌ అయ్యారు. పాఠాలు చదవడం, రాయడం వంటివి నేర్వకుండానే 2వ తరగతి విద్యార్థులు.. 3వ తరగతికి చేరుకున్నారు. చదువుల్లో వీరి భవిష్యత్తు ఏమిటన్నది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఇప్పుడు అంతుబట్టని అంశమైంది. చిన్నారులకు పూర్తిస్థాయి విద్యా సామర్థ్యాలు ఎలా వస్తాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ తరుణంలో.. ప్రాథమిక పరిజ్ఞానానికి దూరమైన పిల్లలకి తల్లిదండ్రులే గురువులుగా మారాల్సిన సమయం వచ్చింది. మీరే మీ చిన్నారులకు పాఠాలను బోధిస్తూ.. వారి బంగారు భవిష్యత్​కు బాటలు వేయాల్సిన అవసరం వచ్చింది. మరి ఆ బోధనలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ కథనం చదివేయండి.

primary education in covid crisis
primary education in covid crisis
author img

By

Published : May 17, 2021, 10:29 AM IST

అమ్మానాన్నలపైనే ఆశలు

చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్న నానమ్మ

ఒక్క రోజు బడికి పోలేదు.. పలకా బలపం పట్టలేదు.. అఆలు, ఏబీసీడీలు వల్లెవేయలేదు.. ఒకటి రెండ్లు నేర్వలేదు.. 1వ తరగతిలో చదువులు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు అయినప్పటికీ వారు రెండో తరగతికి ప్రమోట్‌ అవుతున్నారు. ఇదీ 2020-21వ విద్యాసంవత్సరంలో జిల్లాలోని సర్కారు బడుల్లో 1వ తరగతిలో పేర్లు నమోదు చేసుకున్న బాలల పరిస్థితి. కరోనా నేపథ్యంలో బడులు తెరుచుకోకపోగా, చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి అక్షరాలు నేర్వకుండానే కరీంనగర్​ జిల్లాలోని సర్కారు బడుల్లోని 1వ తరగతి విద్యార్థులు కొత్త విద్యాసంవత్సరంలో 2వ తరగతి చదివేందుకు ప్రమోట్‌ అయ్యారు. పాఠాలు చదవడం, రాయడం వంటివి నేర్వకుండానే 2వ తరగతి విద్యార్థులను 3వ తరగతిలో చేర్చారు. చదువుల్లో వీరి భవిష్యత్తు ఏమిటన్నది జిల్లాలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అంతుబట్టని విషయంగా మారింది. పునాదిగా నిలిచే ప్రాథమిక విద్యాభ్యాసానికి కరోనా ప్రతిబంధకాలు సృష్టించడంతో కొత్త విద్యాసంవత్సరంలో వీరి పరిస్థితి ఏమిటన్నది జిల్లాలోని తల్లిదండ్రులకు బెంగ పట్టుకుంది.

అక్షరాలు నేర్వని 1,2వ తరగతుల బాలలు

పలు వస్తువులను గుర్తించి వాటి పేర్లు రాస్తున్న చిన్నారి

పేర్ల నమోదు వరకే...

కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పాఠశాలలను ప్రారంభించ లేదు. 3-10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌, టీవీల ద్వారా తరగతులను నిర్వహించింది. 1, 2వ తరగతుల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగిసే నాటికి ఎలాంటి తరగతులు జరగలేదు. ఆయా తరగతుల్లో ప్రవేశాలను మాత్రం అన్ని పాఠశాలల్లో చేపట్టారు. ముఖ్యంగా కరోనా కారణంగా జిల్లాలోని సర్కారు బడుల్లో బాలలెవరూ అడుగుపెట్టలేదు. ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆటా, పాటల ద్వారా అక్షరాలతో పాటు అంకెలు నేర్చుకుని తెలుగు, ఆంగ్లం, గణితం పుస్తకాల ద్వారా చదువులో పునాదిని పటిష్ఠం చేసుకునే 1వ తరగతిలో బాలలెవరికి వీటి గురించి తెలియని విషయంగా మారింది. 2వ తరగతి బాలల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

* ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో చేరిన బాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి చదువులను పూర్తి చేయాల్సి ఉన్నందున వారికి 1వ తరగతి పూర్తి చేయకపోయినా చదువుల్లో వారి సామర్థ్యాలు కొంత మెరుగ్గానే ఉంటాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలలు చదువుల్లో ఎలాంటి పునాది లేకుండా వారు పైతరగతులకు వెళుతుండటంతో వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఓ పరీక్షగా మారింది. చదువుకున్న కుటుంబాల్లో చిన్నారులకు తల్లిదండ్రులు కొంత చదువులు నేర్పినా గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు చాలా మంది ఈవిషయాన్ని పట్టించుకోలేదు.

విద్యార్థుల వివరాలు

ఇలా చేయండి..

ఇళ్లలోనే ఉన్న బడీ ఈడు బాలలకు తల్లిదండ్రులపైనే ప్రస్తుత తరుణంలో ‘గురు’తర బాధ్యత ఉంది. వేసవి సెలవులు కావడం, లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉండటం వల్ల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చిన్నారులకు విద్యాపరమైన విషయాలు, నైపుణ్యాలను నేర్పించాలి.

●పలకా బలపం పట్టి చిన్నారులకు అక్షరాలను దిద్దించడం కంటే వాటిని గుర్తు పట్టే సామర్థ్యాలను పెంచాలి. వాటి ఉచ్చారణ నేర్పించాలి.

● చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను అబ్బేలా చూడాలి. ఆన్‌లైన్‌లోని వీడియోలను బాలలకు చూపించాలి.

● పదాలను రాయించడం, బొమ్మలకు రంగులు వేయించడం, పలు రకాల వస్తువుల పేర్లు చెప్పించడం వంటివి చేయించాలి.

● అంకెలు, ఆకారాలను గుర్తించడం, 1వ తరగతిలోని పద్యాలను, ఆంగ్లమాధ్యమంలోని రైమ్స్‌లను ఆట, పాటల ద్వారా నేర్పించాలి.

● స్వతహాగా దుస్తులు వేసుకోవడం, శుభ్రత పాటించడం, భాషా నైపుణ్యాలు, మాట్లాడే తీరును నేర్పించాలి.

● ఇంట్లో ఉపయోగించే వస్తువులను గుర్తించి వాటి పేర్లు, రంగులు, వాటి ఉపయోగాలను బాలలతో ఆట, పాటల ద్వారా చెప్పించే ప్రయత్నం చేయాలి.

● బాలలకు బోధన కోసం చార్టులు, వీడియోలు, ఆన్‌లైన్‌లో గల సమాచారాన్ని వారి కోసం ఉపయోగించాలి.

● 1, 2వ తరగతులకు సంబంధించిన పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను బోధిస్తూ వాటిని అర్థం చేయించడంతో పాటు చదువుల్లో సామర్థ్యాలు సాధించేలా బాలలను తీర్చిదిద్దాలి.

ఇదీ చదవండి: కేటీఆర్​కు వెల్లువెత్తుతున్న వినతులు... భరోసా ఇస్తున్న మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.