కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకురావాలని కరీంనగర్ జిల్లా శశాంక కోరారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవనితో సమానమని కలెక్టర్ తెలిపారు. ప్లాస్మా దాతలందరూ ప్రాణదాతలను ఆయన కొనియాడారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కొవిడ్ దానం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్ విడుదల చేశారు.
ప్లాస్మాదానం విషయంలో అపోహలు పెట్టుకోవద్దన్న ఆయన.. కరోనాకు చికిత్స పొంది కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మాను ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేయాలనుకునే వారు.. స్థానిక సఖి కేంద్రంలో లేదా 9490616780 నెంబర్కు ఫోన్ చేసి.. తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.