తెరాస అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్‌లు తీసుకున్నామన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రశ్నిస్తే విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వీళ్లకు ఎమ్మెల్యేలు లేరని అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ఉంటేనే కొట్లాడాలా అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడటానికి కారణమైన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ ఈ ఐదేళ్లలో కనీసం పూలమాల వేసి నివాళులర్పించలేదని విమర్శించారు.
ఇవీ చూడండి: రేపే స్థానిక సంస్థల తొలి విడత పోలింగ్