ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించడంపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో మండిపడ్డారు. కొనుగోళ్లు కేంద్రాలను పరామర్శిస్తే జీవో 64ను ప్రవేశపెట్టారు. మరి ఆ జీవోలో నిబంధనలు అధికార పార్టీ మంత్రులు, నాయకులకు వర్తించదా అని ప్రశ్నించారు. ఇలాంటి జీవో తెచ్చి ప్రతిపక్షాలను అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమని పొన్నం అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ప్రభుత్వం కుల వృత్తులు చేసుకునే వారందరికీ ఆర్థిక సహాయం అందిస్తే రాష్ట్ర సర్కారు ఎంతమంది కుల వృత్థులకు సహాయపడిందో తెలపాలన్నారు. రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి కానీ దానివల్ల రైతులు ఇబ్బందిపడకుండా చూడాలని పొన్నం డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే..