ETV Bharat / state

Ponnam Prabhakar row : పొన్నంకు అన్యాయం జరిగిందంటూ గాంధీభవన్​లో అనుచరుల హల్​చల్ - Karimnagar Congress leaders On andhi Bhavan

Karimnagar Congress leaders On Gandhi Bhavan : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరుల నినాదాలతో హైదరాబాద్ గాంధీభవన్‌ మార్మోగింది. కాంగ్రెస్​లో పొన్నంకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ కరీంనగర్ లోకసభ పరిధిలోని నాయకులు, ఆయన అభిమానులు గాంధీ భవన్​కు వెళ్లారు. కాంగ్రెస్​ ముఖ్య నాయకులను కలిసి పొన్నం ప్రభాకర్​కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కోరారు.

Ponnam Prabhakar
Ponnam Prabhakar
author img

By

Published : Jul 23, 2023, 10:15 PM IST

Ponnam Prabhakar followers protested at Gandhi Bhavan : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​కు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కోరుతూ కరీంనగర్ లోకసభ పరిధిలోని నాయకులు గాంధీ భవన్​కు వెళ్లారు. గాంధీ భవన్​కు చేరుకున్న ఆయా ప్రాంతాల నాయకులు.. కాంగ్రెస్​ ముఖ్య నాయకులను కలిసి పొన్నంకు ఎన్నికల కమిటీలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కొత్త మంది కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శనతో గాంధీ భవన్ ముందు బైఠాయించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిని కలిసిన పొన్నం అభిమానులు.. తమ నాయకుడిని విస్మరించి పార్టీ పదవులు కట్టబెట్టడం దారుణమన్నారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో దృష్టి సారించాలని రేవంత్​ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీని వలన పార్టీకి ఎంతో లాభం చేకూరుతోందని వివరించారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్​ ఇంఛార్జీ మాణిక్​ రావ్​ ఠాక్రే​ను కలిశారు. పొన్నం ప్రభాకర్​కు కీలక కమిటీల్లో బాధ్యతలు అప్పగించకపోవడం వలన తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Ponnam Prabhakar latest news : ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో సీనియర్ నేత అయిన పొన్నంకు బాధ్యతలు అప్పగించినట్లయితే పార్టీ కూడా బలోపేతం అవుతుందని సూచించారు. పొన్నంకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని మాణిక్​ రావ్​ ఠాక్రే హామీ ఇచ్చారు. గాంధీ భవన్​కు వెళ్లిన వారిలో కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్, వేములవాడ, చొప్పదండి, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

'నా పేరు పక్కన పెట్టి పొన్నంకు అవకాశం కోరుతా': కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో అవసరమైతే తన పేరును పక్కన పెట్టి పొన్నం ప్రభాకర్ పేరు పెట్టాలని కోరతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి నివాసంలో మాట్లాడిన ఆయన.. పీఏసీ ఏర్పడిన తరువాత మొదటి సమావేశానికి వెళ్తున్నానని.. ఎన్నికల స్ట్రాటజీపై కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

బస్సు యాత్రపై ఈ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. టీఆర్టీ అభ్యర్థులకు మద్దతుగా రెండు రోజుల దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతలు దళిత బంధులో 30 శాతం, బీసీ బంధులో 40శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై పోరాటం ఉదృతం చేస్తామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.