పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలిస్తుంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులకు టెండర్లు జరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇష్టం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలను, ఆంధ్ర పాలకులను దూషించి... ఉద్వేగాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని పొన్నం సూచించారు.
ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకపోతే... పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టిండ్రు, నీళ్లు ఎత్తుకుపోతున్నారు. నలుగురు మంత్రులం రాజీనామా చేశాం అని గొప్పగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు నీటి తరలింపుకు టెండర్లు జరుగుతున్నా... సీఎం కేసీఆర్‌కు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు వెళ్లడానికి కూడా సమయం దొరకట్లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'