ETV Bharat / state

పోలీసు జాగిలానికి ఘన నివాళి

author img

By

Published : Apr 30, 2021, 7:06 PM IST

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్​లో.. ఎన్నో కేసుల ఇన్వెస్టిగేషన్​లో సహకరించిన ఓ జాగిలం అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. కొన్నేళ్లుగా తమకు ఎంతో సాయపడిన శునకానికి సంతాపం తెలుపుతూ పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

police dog
police dog

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్​లో అనారోగ్యంతో మృతి చెందిన ఓ జాగిలానికి పోలీసులు ఘన నివాళులు అర్పించారు. డాగ్‌స్వ్కాడ్‌ విభాగానికి చెందిన లిట్టి(13) 2009లో శాఖలో చేరింది. విధి నిర్వహణలో భాగంగా ఏన్నో పేలుడు పదార్థాల ఆచూకీని కనుగొని ప్రముఖులు, పోలీసుల ప్రాణాలను కాపాడిందని సీపీ వి.బి. కమలాసన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.

జాగిలం.. పోలీసు శాఖకు అందించిన సేవలు అమూల్యమైనవని అదనపు డీసీపీ చంద్రమోహన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్‌ రితిరాజ్‌, ఆర్‌ఐ మల్లేశంతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తండ్రిని గడ్డపారతో కొట్టి చంపిన కొడుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.