కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ కాలనీలో డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా విక్రయిస్తున్న రూ. 35 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుపై డీసీపీ చంద్రమోహన్ స్థానికులకు అవగాహన కల్పించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకై ప్రజలు సహకరించాలని కోరారు. తనిఖీల్లో 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు డీసీపీ వివరించారు.