ETV Bharat / state

Pm Modi call to Bandi Sanjay : బండి సంజయ్​కు ప్రధాని ఫోన్​... ఎందుకంటే..? - హైదరాబాద్​ వార్తలు

Pm Modi call to Bandi Sanjay : బండి సంజయ్​కు ప్రధాని మోదీ ఫోన్​ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జాగరణ దీక్ష, అరెస్టు తదితర పరిణామాలపై ఆరా తీశారు. పోరాటాలపై వెనక్కి తగ్గొందని గట్టిగా పోరాడాలని ప్రధాని బండి సంజయ్​కు సూచించారు.

modi call to bandi sanjay
modi call to bandi sanjay
author img

By

Published : Jan 8, 2022, 5:20 PM IST

Updated : Jan 8, 2022, 7:43 PM IST

Pm Modi call to Bandi Sanjay : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ జాగరణ దీక్ష... అరెస్టు పరిణామాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తెరాసతో గట్టిగా పోరాడాలని ఎక్కడా వెనక్కి తగ్గొద్దని... ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం కొనసాగించాలని తెలిపారు. ఎంపీ కార్యాలయంపై దాడిని ప్రధాని ఖండించారు.

దాడికి కారణాలేంటి..?

తెరాస ప్రభుత్వంపై సంజయ్‌ చేస్తున్న పోరాటాన్ని మోదీ అభినందించారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా తప్పులేదని సంజయ్‌తో అన్నారు. 317జీవో గురించి మోదీ ఆరా తీశారు. వ్యక్తిగతంగా సంజయ్‌పై దాడి చేయడానికి కారణాలేంటని ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను కూడా మోదీ ప్రస్తావించారు. వరుస విజయాలతో తెరాస వ్యక్తిగత దాడులకు దిగుతోందా అని మోదీ ఆరా తీశారు.

ఏం జరిగిందంటే..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన.. జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను.. పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన దీక్షకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలను తప్పించుకొని.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్‌ దీక్ష చేపట్టగా, పోలీసులు తలుపులు పగులగొట్టి.. ఆయణ్ను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: Bandi Sanjay: కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల

Last Updated : Jan 8, 2022, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.