మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు కరీంనగర్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీపీల ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయానికి తెరాస ఎంపీటీసీ సభ్యులతో పాటు వారి మద్దతుదారులైన ఎంపీటీసీ సభ్యులు ఉదయాన్నే చేరుకున్నారు. చొప్పదండి మండలంలోని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు కిడ్నాప్ ప్రచారంతో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండల కార్యాలయాల ముందు ఇతరులను అనుమతించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: దర్జాగా వచ్చాడు... ఫోనెత్తుకెళ్లాడు..