ETV Bharat / state

లక్ష్మీపూర్ బాలుడి కుటుంబానికి ఎంపీ పరామర్శ - bjp state president bandi sanjay latest news

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​లో బావిలో పడి మృతి చెందిన పంతగాని రేవంత్(9) తల్లిదండ్రులను పరామర్శించారు. ఎంపీతోపాటు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్​ యాదవ్​ ఉన్నారు.

MP Bundi Sanjay, who has Visitation the deceased's family in karimnagar district
బండి సంజయ్​ పరామర్శ
author img

By

Published : Jun 14, 2020, 12:39 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​లో బావిలో పడి మృతి చెందిన పంతగాని రేవంత్(9) కుటుంబ సభ్యులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి పక్క నుంచి సైకిల్​పై వెళ్తూ రేవంత్​ అదుపు తప్పి అందులో పడి​ ప్రాణాలు కోల్పోయాడు. రేవంత్ తల్లిదండ్రులు, తాతను సంజయ్ ఓదార్చారు.

ప్రమాదకరంగా ఉన్న బావి పూడ్చి వేయాలని మృతుడి తాత ఎంపీకి వినతిపత్రం ఇచ్చారు. గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం చేశారని వాపోయారు. సంజయ్​తోపాటు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్ ఉన్నారు.

ఇవీ చూడండి: 'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.