ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కోతుల కిష్కిందకాండ - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

అడవులు క్రమంగా తగ్గిపోతుండటంతో కోతులు జనావాసాలకు పరుగులు తీస్తున్నాయి. వందల సంఖ్యలో మర్కటాలు పల్లె, పట్టణాల్లోకి వస్తున్నాయి. పంటలు పాడుచేయడమే కాకుండా వీధుల్లో ఒంటరిగా నడవలేని స్థితిని కల్పిస్తున్నాయి. కోతుల బెడదను తప్పించేందుకు వానర వనాలు పెంచినా ఫలితం లేకుండా పోయింది. పట్టుకున్న కోతులను అడవుల్లో వదిలిపెట్టినా మళ్లీ గ్రామాల వైపు వస్తుండటంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

monkeys problems in karimnagar district
ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కోతుల కిష్కిందకాండ
author img

By

Published : Dec 26, 2020, 3:55 PM IST

Updated : Dec 26, 2020, 10:45 PM IST

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కోతుల కిష్కిందకాండ

ఉమ్మడి కరీంనగర్​‌ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి దుకాణాలు, ఇళ్లకు ఇనుప జాలీలు దర్శనమిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు చేపట్టారు. ఒకేసారి 30 నుంచి 40 వానరాలు దండెత్తి వచ్చి దుకాణాల్లోని సామాన్లు లాక్కెళ్లడం.. పళ్లు, కూరగాయలు తీసుకెళ్లటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్‌ నుంచి హుజూరాబాద్‌ వైపు వెళ్లే మార్గంలోని ప్రతి దుకాణానికి ఇనుప జాలీలు దర్శనమిస్తున్నాయి.

వానర వనాలు

ప్రణాళిక బద్ధంగా వానర వనాలు పెంచితే కోతుల బెడద తగ్గించవచ్చని ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే ప్రతి గ్రామ పంచాయతీలో వానర వనాలను పెంచాలని సూచించింది. అందులో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో 15, పెద్దపల్లి జిల్లాలో 263, జగిత్యాల జిల్లాలో 100 రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 వానర వనాలను పెంచాలని ఆదేశించింది. గత రెండేళ్లుగా ఆయా జిల్లాలో వానర వనాలను పెంచుతున్నారు. అయితే వానర వనాల పెంపకం కేవలం ఫైళ్లకే పరిమితమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

కూరగాయల తోటల్లో స్వైరవిహారం

ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల మున్సిపాలిటీల్లో కోతులను పట్టుకున్నప్పటికీ వాటిని సమీపంలోని అడవుల్లో వదిలేస్తున్నారు. కోతులు మళ్లీ గ్రామాల వైపు పరుగులు తీస్తున్నాయి. చిన్నచిన్న దుకాణాలతో పాటు కరీంనగర్ శివారులోని రైస్‌మిల్లులు, కూరగాయల తోటల్లోనూ కోతులు కిష్కిందకాండను సృష్టిస్తున్నాయి. చాలా మంది రైతులు కూరగాయలు పండించడానికే ఇష్టపడటం లేదు. మరోవైపు రైస్‌మిల్లర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ధాన్యం బస్తాలను కాపాడుకొనేందుకు కప్పే టార్పాలిన్లు చింపి ముక్కలు చేస్తుండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోతుల అదుపు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'సాగర్​' సమరం.. పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం

Last Updated : Dec 26, 2020, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.