చిన్న పిల్లలు చరవాణిలో ఆటలు ఆడుతూ క్రీడలకు దూరం అవుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అదే క్రీడల్లో పాల్గొంటే మానసిక దృఢత్వం పొందవచ్చని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
మొదటి మ్యాచ్ ఇరుజట్ల పరిచయ కార్యక్రమం తరువాత ఎమ్మెల్యే టాస్ వేశారు. బౌలింగ్, బ్యాటింగ్ చేసి క్రీడా స్ఫూర్తిని చాటారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పేర్లు ఇచ్చినట్టు నిర్వాహకులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఓట్ల కోసమే ఉద్యోగాల విషయంలో నిరాధార ఆరోపణలు'