కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో శాసన సభ్యులు సుంకె రవిశంకర్ పర్యటించారు. చొప్పదండి మున్సిపాలిటీలోని పలు వార్డులు సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగు కాల్వల్లో పేరుకున్న చెత్తను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. దోమలు పెరిగేందుకు అవకాశమున్న ఖాళీ కొబ్బరిబోండాలు, ఇంటి చుట్టుపక్కల ఉన్న గడ్డిమొక్కలను తొలగించారు.
పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే.. విషజ్వరాలు వచ్చే ప్రమాదముందని ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డుల్లో బ్లీచింగ్ పౌడర్ క్రమం తప్పకుండా చల్లి.. సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చూడండి: మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి