రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తెరాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల తెరాస నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేటీఆర్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దిశానిర్దేశం చేస్తూ.... పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. విభిన్న సంక్షేమ పథకాల అమలులో మంత్రి కేటీఆర్ కృషి అభినందనీయమన్నారు. వ్యాధిగ్రస్తులకు రక్తదానం ప్రాణదానం అను సంకల్పంతో తెరాస కార్యకర్తలు అధిక సంఖ్యలో రక్తదానం చేయడం ఆనందదాయకమన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో కలిసి కేకు కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.