ETV Bharat / state

రాంచీ నుంచి కరీంనగర్​కు.. తొమ్మిదేళ్ల తర్వాత సొంతవాళ్ల చెంతకు.. ఆమె ప్రయాణం..! - ranchi women reached home after 9 years

మతిస్థిమితం కోల్పోయి కుటుంబానికి దూరమైన మహిళ... తొమిదేళ్ల తర్వాత సొంత వాళ్ల దగ్గరకు చేరింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి చెందిన బబితా అనే వివాహిత.. మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయింది. రాంచీలో తప్పిపోయిన బబిత... కరీంనగర్‌లో ప్రత్యక్షమైంది. అభాగ్యురాలిగా ఉన్న ఆమెను గుర్తించిన ప్రాకృతి ఎన్విరాన్‌మెంటల్‌ సొసైటీ నిర్వాహుకులు... అక్కున చేర్చుకుని ఆదరించారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ జాతీయ మెమోరియల్‌ ట్రస్ట్‌కు తరలించి వైద్యం అందించారు.

Missing Lady Identified after 9 years
Missing Lady Identified after 9 years
author img

By

Published : Oct 24, 2021, 4:54 AM IST

రాంచీ నుంచి కరీంనగర్​కు.. తొమ్మిదేళ్ల తర్వాత సొంతవాళ్ల చెంతకు.. ఆమె ప్రయాణం..!

రాంచీకి దగ్గరలోని తోరుఫాకు చెందిన వివాహిత బబిత మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లే రైలు ఎక్కేసింది. బబిత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆమె ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. మతిస్థిమితం లేకుండా తప్పిపోయిన బబిత ఎట్టకేలకు 2012లో కరీంనగర్‌కు చేరింది.

తొమ్మిదేళ్ల బబిత ప్రయాణం...

దీనస్థితిలో ఉన్న ఈ అభాగ్యురాలిని.. ప్రాకృతి ఎన్విరాన్‌ మెంటల్‌ సొసైటీ చేరదీసింది. ఆమెను మాములు స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో సొసైటీ సభ్యులు 2014లో హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ జాతీయ మోమోరియల్‌ ట్రస్ట్‌కు తరలించారు. అక్కడ ఉంటూనే ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో వైద్యం తీసుకుంది. 2014 నుంచి 2019 వరకు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడటంతో.. కాస్త సాధారణ స్థితిలోకి వచ్చింది. ఈ సమయంలోనే ఆశ్రమ నిర్వాహుకులు, వైద్యులు వివరాలను ఆరా తీశారు. రాంచీ సమీపంలోని తోరుఫా అని చెప్పింది. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్‌ యూనిట్‌ సహకారంతో బబిత కుటుంబ సభ్యులను గుర్తించి.. ఆమె బతికే ఉందనే సమాచారాన్ని అందించారు. తొమిదేళ్ల క్రితం తప్పిపోయిన బబిత బతికే ఉందన్న సమాచారంతో.. ఆమె కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఎట్టకేలకు కుటుంబసభ్యుల చెంతకు..

బబిత బతికే ఉన్న సమాచారం తెలిసినప్పటికీ ఆశ్రమ నిర్వాహుకులు పూర్తి స్థాయిలో నిర్థారించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఈలోగా కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో రవాణా సదుపాయం లేక ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ రాలేకపోయారు. ఎట్టకేలకు బబిత కుమార్తె, సోదరుడు, సోదరి... హైదరాబాద్‌ రావడంతో అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మతిస్థిమితం కోల్పోయిన బబితను మామూలు మనిషిని చేసి... కుటుంబ సభ్యులకు అప్పగించడం పట్ల కస్తూర్బా గాంధీ జాతీయ మోమోరియల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి పద్మావతి సంతోషం వ్యక్తం చేశారు.

భావోద్వేగానికి లోనైన కుటుంబీకులు...

తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన బబితను.. ప్రత్యక్షంగా చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. బబితను అలింగనం చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు.

"ఇన్నేళ్లకు మా అక్క దొరకడం చాలా సంతోషంగా ఉంది. బబిత అసలు పేరు కుల్మని బెంగ్రా. రంగారెడ్డి జిల్లా డీసీపీతో మేడం మాట్లాడించారు. చాలా సంతోషం వేసింది. తెలంగాణకు మేము మొదటిసారి వచ్చాం. ఇన్నేళ్లుగా బబిత (కుల్మని బెంగ్రా) ను సంరక్షించినందుకు మేడంకు కృతజ్ఞతలు చెబుతున్నాను." - బబిత సోదరుడు

బబితను ఆమె కుటుంబ సభ్యులు... స్వరాష్ర్టానికి తీసుకువెళ్తున్న సందర్భంలో... తోటి వాళ్లు ఆనందబాష్పాలతో తుది వీడ్కోలు పలికారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.