ETV Bharat / state

'తీగలవంతెన పనులు జూన్​ నాటికి పూర్తి చేయాలి' - minister gangula kamalakar review on karimnagar R&B Works today news

కరీంనగర్​లో నిర్మిస్తున్న తీగలవంతెన పనులను వచ్చే జూన్ వరకు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగులకమలాకర్ అధికారులను ఆదేశించారు.

minister gangula kamalakar review on karimnagar R&B Works
minister gangula kamalakar review on karimnagar R&B Works
author img

By

Published : Nov 27, 2019, 8:24 PM IST

కరీంనగర్​కు సంబంధించిన ఆర్ అండ్ బీ శాఖ పనుల పురోగతిపై ఇంజినీర్లు, అధికారులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్​లో సమీక్ష నిర్వహించారు. తీగలవంతెన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోతే కుదరదని టాటా ట్రస్ట్​కు మంత్రి స్పష్టం చేశారు. వంతెనకు అవసరమైన భూసేకరణతోపాటు మిగతా పనులకు అవసమరమయ్యే నిధుల వివరాలకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సర్వీస్ రహదార్లు, అండర్ పాస్​లతో పాటు వంతెనపై డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలపై చర్చించారు. ఎలగందుల మీదుగా కరీంనగర్-వేములవాడ రహదారి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ ఇంజినీర్​ను మంత్రి ఆదేశించారు.

'తీగలవంతెన పనులు జూన్​ నాటికి పూర్తి చేయాలి'

ఇవీచూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

File : TG_Hyd_63_27_KRN_Suspension_Bridge_AV_3053262 From : Raghu vardhan Note : Feed from Whatsapp ( ) కరీంనగర్ నగరాన్ని పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దుతోన్న క్రమంలో తీగలవంతెనను వచ్చే జూన్ వరకు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగులకమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ కు చెందిన ఆర్ అండ్ బీ శాఖ పనుల పురోగతిపై ఇంజనీర్లు, అధికారులతో మంత్రి హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్ నాటికి వంతెనను పూర్తి చేయాలని టాటా ట్రస్ట్ కు సూచించిన మంత్రి... నిర్ధేశిత సమయంలో పనులు పూర్తి చేయకపోతే కుదరదని హెచ్చరించారు. వంతెనకు అవసరమైన భూసేకరణ, తదితరాలకు అవసమరమయ్యే డబ్బు వివరాలకు సంబంధించి వెంటనే నివేదిక సమర్పించాలని అధికారులను కమలాకర్ ఆదేశించారు. సర్వీస్ రహదార్లు, అండర్ పాస్ లతో పాటు వంతెనపై డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలపై సమీక్షించారు. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు పొంది అనుకున్న సమయానికి ప్రారంభోత్సవం చేపట్టాలని మంత్రి అధికారులను కోరారు. ఎలగందుల మీదుగా కరీంనగర్-వేములవాడ రహదారి పనుల పురోగతిని సమీక్షించిన గంగుల కమలాకర్... సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.