తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 6,490 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కురిచేడులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఇప్పటివరకు 2,660 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. 41 వేల 76 వేల మంది రైతుల నుంచి రెండు లక్షల 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు రూ. 499 కోట్లు అన్నదాతలకు చెల్లించామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఎఫ్సీఐ అనుమతి తీసుకుని రంగుమారిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం 1988 రూపాయలు చెల్లిస్తుందని.. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం కొనుగోలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలి: ఎర్రబెల్లి