ఉపఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌లో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తరఫున మంత్రి గంగుల కమలాకర్ ప్రచారంలో పాల్గొన్నారు. 22వ వార్డులో ప్రచారం చేశారు. రాధస్వామి సత్సంగ్‌లో కాలనీవాసులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఈటల చేసింది ఏమీలేదని మంత్రి గంగుల విమర్శించారు.
అభివృద్ధిలో ముందుగు సాగాలని... అది తెరాసతోనే జరుగుతుందని మంత్రి గంగుల వెల్లడించారు. పదవి ఇచ్చినా.. ఈటల ఏం అభివృద్ధి చేయలేదని... ఆస్తులను కూడబెట్టుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని... భాజపా అభ్యర్థి ఈటల గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంతరవకు ఏం చేయలేదని, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు దగ్గర రూపాయి లేదని ఎద్దేవా చేశారు. తెరాస అభ్యర్థిని ఆశీర్వదించాలన్నారు. నియోజకవర్గ ప్రజలపై అభిమానం ఉంటే బొట్టుబిల్లలు, కుట్టు మిషన్లు పంచటమెందుకని ఈటలను ప్రశ్నించారు. రెండు పడకల గదులను ఒక్కటైనా పూర్తయ్యాయా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: Huzurabad by poll: హుజూరాబాద్ ఉపపోరు.. నేడు ముగ్గురు అభ్యర్థుల నామినేషన్.