కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జిలుగు సాగును మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. జిలుగు సాగు వల్ల కలిగే లాభాలను రైతులకు వ్యవసాయ అధికారులు మంత్రి సమక్షంలో వివరించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సతీష్ కూమార్ కూడా ఉన్నారు. అధిక మోతాదులో రసాయన ఎరువులు, క్రిమి సంహారక ఎరువులు వాడకూడదని మంత్రి సూచించారు.
జిలుగు సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గటమే కాకుండా భూమికి పోషకాలు కూడా అందుతాయని ఆయన తెలిపారు. క్లస్టర్ల వారిగా రైతు వేదికలను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఆర్డీవో బెన్‌షలోమ్, ఏడిఏ ఆదిరెడ్డి, ఏవో సునీల్, తహశీల్దార్ బావుసింగ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్