కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో అన్ని నియోజకవర్గాల కంటే హుజూరాబాద్ ముందుండేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. దాదాపు లక్ష సభ్యత్వాలు నమోదు చేసేందుకు శ్రమించాలని కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పార్టీ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు కార్డులు కూడా అందజేస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. విషయాన్ని ప్రజలకు వివరించి సభ్యత్వాలు పూర్తి చేయడమే కాకుండా సభ్యత్వ పుస్తకాలను తెలంగాణ భవన్‌కు చేర్చే బాధ్యత కూడా స్థానిక నాయకులదేనని మంత్రి వెల్లడించారు.