కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. పలుశాఖల అధికారులు ప్రగతి నివేదికలు ప్రజా ప్రతినిధుల ముందు నివేదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉండాలన్నారు. మరో ఎజెండా ఉండకూడదని వెల్లడించారు. స్థానిక సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కాకపోతే ప్రభుత్వం పరంగా మా దృష్టికి తీసుకవస్తే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ గ్రామాలు అద్దంలా ఉంటే మా శాఖకు పని ఉండదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ స్కాం: 23 మంది ఇళ్లలో అనిశా సోదాలు