ETV Bharat / state

Synergy grants: ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో స్థానిక సంస్థల ప్రగతికి అవరోధం

2016వ సంవత్సరంలో సీనరేజీ నిధుల కోసం ఉమ్మడి జిల్లాలోని పలువురు సర్పంచులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. గంగాధర మండలం గట్టుబూత్కురు అప్పటి సర్పంచి శోభ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పంచాయతీకి రావాల్సిన 25 శాతంవాటా డబ్బు రూ.4.75కోట్లు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఆ గ్రామానికి రాయాల్టీ వాటాగా నిధులు జమయ్యాయి. ఇదే తరహాలో పలువురు సర్పంచులు కూడా న్యాయపోరాటాన్ని సాగించారు.

Synergy grants
సీనరేజీ నిధులు
author img

By

Published : Aug 8, 2021, 9:10 AM IST

గడిచిన ఐదేళ్లుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌, గ్రామపంచాయతీలకు గనుల తవ్వకాలకు సంబంధించి సీనరేజీ రుసుము రావాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా జిల్లాలోని గనులు, ఇసుక క్వారీల నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజనాకు చేరుతున్నా.. అభివృద్ధి వాటాగా జిల్లాలకు రావాల్సిన నిధులు సకాలంలో స్థానిక సంస్థలకు అందడం లేదు. జిల్లాలో గడిచిన ఐదారేళ్లుగా సీనరేజీ విషయంలో పంచాయతీలకు నిరాశే మిగులుతోంది.

సహజ వనరుల ద్వారా పంచాయతీలకు సమకూరే సీనరేజీ నిధులు కొన్నేళ్లుగా నాలుగు జిల్లాలకు అనుకున్న విధంగా విడుదలవడం లేదు. వందల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో అనుకున్న అభివృద్ధి పల్లెల ధరి చేరడంలేదు. నాలుగు జిల్లాల పరిధిలో సుమారు 600కుపైగా గ్రానైట్‌ క్వారీలున్నాయి. ఏ ప్రాంతంలో ఇవి ఉంటాయో వాటి వినియోగం ద్వారా వచ్చే సీనరేజీ నిధులు ఆ ప్రాంతంలోని స్థానిక (గ్రామ, మండల, జడ్పీ) సంస్థల అభివృద్ధికి కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో గ్రానైట్‌, కంకర, కటింగ్‌ పాలిషింగ్‌ రాయికి రాయల్టీ చెల్లింపులు వేర్వేరుగా ఉంటాయి. ఇలా వచ్చిన ఆదాయంలో జిల్లా పరిషత్‌కు 25 శాతం, మండల పరిషత్‌కు 50 శాతం, జిల్లా పంచాయతీకి 25శాతం నిధులు జమచేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు గ్రానైట్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా జడ్పీ ఖాతాలో జమ చేసేవారు. అక్కడినుంచి మండలాలకు, గ్రామాలకు వెళ్లేవి. ప్రస్తుతం నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లి అటునుంచి అడపాదడపా అందుతున్నాయి.

తరచూ ఇదే ఇబ్బంది..

ఉమ్మడి జిల్లాకు సంబంధించి గ్రానైట్‌తోపాటు ఇతర ఖనిజ సంపదల నుంచి వసూలు చేసిన సీనరేజీ నిధులు ఎప్పటికప్పుడు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. గడిచిన దశాబ్దకాలం నుంచి రావాల్సిన వాటిలో కనీసం 20శాతంలోపు నిధులే స్థానిక సంస్థలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కొత్తగా పంచాయతీల పాలకవర్గాలు ఏర్పాటైనప్పటి నుంచి వీటి ఊసే లేదని పలువురు వాపోతున్నారు. 1990-91 నుంచి 2015-16 వరకు రూ.932 కోట్ల మేరకు బకాయిలున్నాయని వాటిని విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు ఆయా సందర్భాల్లో విన్నవించారు. తరువాత కొన్నాళ్లకు కొంతమేరకు నిధులు విడుదలైనా.. తరువాత మరిన్ని వార్షిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉంది. మొత్తంగా వందల కోట్ల రూపాయల విషయంలో స్థానిక సంస్థలు ఎదురుచూస్తున్నా. ఇసుక క్వారీలకు సంబంధించినవి మాత్రమే విడుదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా స్థానిక సంస్థలకు అందాల్సిన వీటి విషయంలో ప్రభుత్వం చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: krmb, grmb: 'బోర్డుల సమావేశం వాయిదా వేయలేం'.. మరి తెలంగాణ హాజరవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.