ETV Bharat / state

ప్రతి ఆటోలో క్యూ ఆర్​ కోడ్.. ప్రయాణికుల రక్షణే ప్రాధాన్యం​

రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం.. సాంకేతికతను ఉపయోగించుకుని నేరాలను అదుపు చేసేలా చర్యలు తీసుకుంటోంది. సీసీ కెమెరాలు, రక్షణ యాప్​లు తదితర వాటి ద్వారా ఇప్పటికే అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రైవేటు రవాణాలో ప్రధానంగా ఉన్న ఆటో ప్రయాణం సురక్షితంగా ఉండటానికి కరీంనగర్​ పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ప్రతి ఆటోకు క్యూఆర్​ కోడ్ కేటాయించి​ ప్రయాణికుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

karimnagar, qr code in autos
కరీంనగర్​, ఆటోలో క్యూఆర్​ కోడ్​, కరీంనగర్​ ట్రాఫిక్​ పోలీసులు
author img

By

Published : Jan 11, 2021, 1:52 PM IST

నేరాలను అరికట్టేందుకు కరీనంగర్ పోలీసులు మరో పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నారు. కరీంనగర్‌లో ప్రతి ఆటోకు క్యూఆర్‌ కోడ్‌ కేటాయించి ప్రయాణానికి మరింత భద్రత కల్పించే దిశగా సాగుతున్నారు. ప్రతి రోజు నగరానికి వచ్చే వేలాది మంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు సీసీ కెమెరాలు.. మరోవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారు.

విధిగా కోడ్​ స్కాన్​ చేసుకోవాలి

కరీంనగర్​లో సుమారు 8వేల వరకు ఆటోలు ఉన్నాయి. వివిధ జిల్లాలు, పట్టణాల నుంచి ప్రతిరోజు దాదాపు లక్ష మంది వస్తుంటారని అంచనా. విద్య, వాణిజ్య, వైద్య ఇతరత్రా అవసరాల కోసం వచ్చే వారికి ఏకైక రవాణా సదుపాయంగా ఆటో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆటో ప్రయాణాన్ని సురక్షితంగా తీర్చిదిద్దటానికి సీపీ కమలాసన్‌రెడ్డి బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ప్రతి ఆటో ఎక్కడికి వెళుతుంది. అందులో ప్రయాణించే వారి పట్ల ఆటోడ్రైవర్లు ప్రవర్తించే తీరును కాపలా కాయడం కష్టంగా మారింది. దీనితో ప్రతి ఆటోకు సంబంధించిన వివరాలన్నీ ట్రాఫిక్‌ పోలీసులు సేకరించారు. వారికి సంబంధించి పుట్టు పూర్వోత్తరాలు తమ వద్ద పెట్టుకోవడమే కాకుండా.. ప్రతి ఆటోకు ఒక క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించారు. ఆటోలో ప్రయాణించే వారు విధిగా ఈ క్యూఆర్‌ కోడ్‌ను తమ ఫోన్లలో స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కోడ్‌ స్కాన్ చేయగానే ఆటోడ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రయాణికునికి చేరుతాయి. ఒక వేళ డ్రైవర్ ప్రవర్తన సరిగా లేకపోతే నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందించే సదుపాయాన్ని క్యూఆర్‌ కోడ్‌లో కల్పించినట్లు ట్రాఫిక్‌ సీఐ తిరుమల్ తెలిపారు.

ప్రతి ఆటోకు క్యూఆర్‌ కోడ్ విధానాన్ని యజమానులు ఆహ్వానిస్తున్నారు. వేల ఆటోలు ఉన్న కరీంనగర్ నగరంలో ఎవరో ఒకరు అనుచితంగా ప్రవర్తిస్తే వారి వివరాలు తెలియకపోగా.. అందరూ అప్రతిష్ఠపాలయ్యే వారమని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విధానం వల్ల ప్రయాణికులు నిర్భయంగా ఆటోల్లో ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఒక వేళ ప్రయాణీకులు తమ విలువైన సామాన్లు పోగొట్టుకున్నా.. మరిచిపోయినా వాటిని త్వరగా పొందేందుకు వీలుంటుందని సంతృప్తిని వ్యక్తం చేశారు. తాము కూడా విధిగా క్యూఆర్ కోడ్‌ ఉన్న ఆటోల్లోనే ప్రయాణించాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

తిరుమల్‌, ట్రాఫిక్ సీఐ, కరీంనగర్

కరీంనగర్ పోలీసులు అమలు చేస్తున్న ఈ విధానం పట్ల మహిళలు, యువతులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఆటోలో ప్రయాణించాలంటే అంతగా సురక్షితంగా ఉండేది కాదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆటోలో ఎక్కగానే డ్రైవర్ సీట్‌ వెనక భాగంలోని క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసుకుంటున్నామని వివరించారు.

ప్రతి ఆటోలో క్యూ ఆర్​ కోడ్.. ప్రయాణికుల రక్షణే ప్రాధాన్యం​

ప్రచారం అవసరం

ఇప్పటికే ప్రతి ఆటోకు క్యూఆర్‌ కోడ్‌ అమలు చేస్తున్న పోలీసులు.. మరింత విస్తృతంగా క్యూఆర్ కోడ్‌ ప్రాధాన్యత గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నిరక్షరాస్యులు కూడా వినియోగించే విధానం అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.