ప్లాస్టిక్ నిషేధంగా హోటల్ ముందడుగు.. అధికారి ప్రశంసలు కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ నివారణ ధ్యేయంగా ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గీతా భవన్ హోటల్ యాజమాన్యం బట్ట సంచులను వాడడంపై అభినందించారు. హోటల్కు స్వయంగా వెళ్లి యజమానికి పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రశంసించారు.ప్లాస్టిక్ కవర్లకు బదులు టిఫిన్ బాక్స్‌తో వచ్చిన వారికి మిఠాయిలలో రాయితీ ఇవ్వాలని ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి కోరారు. అందుకు హోటల్ యజమాని సందీప్ అంగీకరించారు. మిగతా హోటళ్ల యాజమాన్యాలు ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: గ్యాస్‌తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిపి చంపేశాడు