అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మూసేస్తానని సీఎం అన్నారని... మరీ రాష్ట్రం కూడా అప్పుల్లో ఉందని... అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని కోరారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ముఖ్యమంత్రిని, తెరాస పార్టీని ఏం చేయాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మీకులను, రాజకీయ పార్టీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని... రైతులను ఆదుకుంటారా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
ఇవీ చూడండి: చర్చలు విఫలం... పిలిస్తే మళ్లీ వెళ్తాం: అశ్వత్థామ రెడ్డి