ETV Bharat / state

సంక్షేమశాఖ వసతి గృహాలకు.. పోటాపోటీ

అధికారులు ఏటా కొత్త కళాశాల వసతి గృహాలను ఏర్పాటు చేసినా వాటి సామర్థ్యం కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖ కళాశాల వసతి గృహాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

సంక్షేమశాఖ వసతి గృహాలకు..పోటాపోటీ
author img

By

Published : Jul 7, 2019, 5:05 PM IST

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తున్న దరఖాస్తులను స్వీకరించకుండా ఆయా వసతి గృహ సంక్షేమాధికారులు తిరస్కరిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు నగరంలో వసతి కరవవుతోంది. ప్రస్తుతం ఇంటర్‌, డిగ్రీ కోర్సులకు మాత్రమే అడ్మిషన్లు పూర్తికాగా ఇంజినీరింగ్‌, పీజీ విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంటర్‌ విద్యార్థుల కోటా నిండిపోయిందని, వసతి గృహాలలో సీట్లు లేవంటూ విద్యార్థులను పంపిస్తున్నారు. ఉన్నత విద్య చదవాలనుకునే నిరుపేద విద్యార్థులకు సీట్ల కొరత కలతకు గురిచేస్తోంది.

పెద్దఎత్తున విద్యార్థులు
నగరంతోపాటు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌-8, డిగ్రీ-16, ఎంబీఏ-10, ఫార్మసీ-6, ఇంటర్‌-24, పీజీ-10, డీఈడీ-4, బీఈడీ-6 కళాశాలలు, శాతవాహన విశ్వవిద్యాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులతోపాటు మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి విద్యార్థులు పెద్దఎత్తున జిల్లా కేంద్రానికి వస్తున్నారు. అద్దె గదుల్లో ఉండాలనుకుంటే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో వసతి గృహల్లో ఉండేందుకే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్‌ వసతి గృహల్లో ఒక్కోక్క విద్యార్థికి నెలకు సుమారు రూ.2,300లు వసూలు చేస్తున్నారు.

నాలుగింతల దరఖాస్తులు
నగరంలో నాలుగు బాలికల కళాశాల స్థాయి, మూడు బాలుర కళాశాల స్థాయి వసతి గృహాలు ఉన్నాయి. బాలికల వసతి గృహాల్లో 231 ఖాళీలు ఉంటే 460, బాలుర వసతి గృహాల్లో 178 ఖాళీలకు 399 దరఖాస్తులు వచ్చాయి. నగరంలోని ఏడు వసతి గృహాల్లో 409 ఖాళీలకు 859 దరఖాస్తులు అందాయి. ఖాళీల్లో 50 శాతం ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కేటాయించగా 50 శాతం డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు పక్కనపెట్టారు.

కొత్తవి ఏర్పాటు చేయాల్సిందే
జిల్లాకేంద్రంలో ఒకటి బాలుర, రెండు బాలికల వసతి గృహాలు ఉంటే గతేడాది అనూహ్యంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తడంతో అదనంగా బాలికలకు, బాలురకు కొత్తవి ఏర్పాటు చేశారు. తద్వారా కొంత మేర వసతి కొరతను తీర్చగలిగారు. 2019-20 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు కుప్పలుగా వచ్చాయి. ఈ విషయాన్ని ముందే ఊహించిన వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి వేసవి సెలవుల్లోనే చొప్పదండిలోని బాలికల కళాశాల వసతి గృహాన్ని నగరానికి తరలించారు. ఆ వసతి గృహంలో 84 ఖాళీలు ఉంటే 140 దరఖాస్తులు వచ్చాయి. మరో కొత్త వసతి గృహం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

వసతి గృహాలు వెలవెల
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించిన వసతి గృహాల్లో విద్యార్థులు లేక వెలవెలపోతున్నాయి. జమ్మికుంటలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో 90 ఖాళీలు ఉంటే 17 దరఖాస్తులు వచ్చాయి. హుజూరాబాద్‌లోని బాలికల వసతి గృహంలో 76 ఖాళీలకు 10, వెదిరలోని బాలుర వసతి గృహంలో 48 ఖాళీలకు 07, మానకొండూర్‌ బాలుర వసతి గృహంలో 49 ఖాళీలకు 42 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క మానకొండూర్‌ మినహా ఎక్కడా విద్యార్థుల ఆదరణ లేదన్న విషయం తెలుస్తోంది.

నిబంధనల మేరకే సీట్ల కేటాయింపు
వసతి గృహాల్లో ఖాళీలకు అనుగుణంగా ఇంటర్‌ విద్యార్థులకు 50 శాతం సీట్లు, మిగతా 50 శాతం సీట్లు డిగ్రీ, పీజీ విద్యార్థులకు కేటాయించాం. ఖాళీలకన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : పంజాగుట్టలో దాడికి గురైన వ్యాపారి మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.