ETV Bharat / state

'రామమందిర నిర్మాణానికి హిందువులంతా ఏకం కావాలి' - రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం హిందువులంతా ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చిందని కరీంనగర్​లోని గీతా మందిరం స్వామీజీ అన్నారు. జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గోడ ప్రతులను ఆవిష్కరించారు.

karimnagar grrthamandir swamyji call for all hindus should unite for construction of Rama Mandir
'రామ మందిర నిర్మాణానికి హిందువులంతా ఏకం కావాలి'
author img

By

Published : Jan 16, 2021, 6:59 PM IST

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని గీతా మందిరం స్వామీజీ అన్నారు. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చిందని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికీ తిరుగుతూ విరాళాలను సేకరిస్తానని పేర్కొన్నారు.

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం ఆవరణలో శ్రీ రామ మందిరం నిర్మాణ ట్రస్టు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని గోడ ప్రతులను ఆవిష్కరించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ నిధులు సమకూర్చేందుకు పాదయాత్ర చేపట్టారు. స్వామిజీకి ఘన స్వాగతం పలికిన భక్తులు తోచినంత సాయం అందించారు.

ఇదీ చదవండి: డ్రైవరే కేటుగాడు.. గోల్డ్ దొంగలు దొరికారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.