ETV Bharat / state

వసతుల కల్పనలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

పాఠశాలలు ప్రారంభం కానున్న సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తోన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

karimnagar collecter suddud vist school in ganneruvaram

author img

By

Published : Jan 30, 2021, 6:44 AM IST

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటైషన్, టాయిలెట్స్, మంచినీరు, కరెంటు వంటి వసతుల కల్పనపై నిర్లక్ష్యం వహిస్తున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకు ముందు నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో స్వాతి, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.