ETV Bharat / state

రాజకీయమా.. రైతుల బాధలా: కృష్ణా రెడ్డి - మంత్రి గంగుల కమలాకర్​ తాజా వార్తలు

మంత్రి గంగుల కమలాకర్​కు హుజూరాబాద్ రాజకీయాలు ముఖ్యమా..? లేక రైతుల బాధలు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు కరీంనగర్​ జిల్లా భాజపా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి. అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని.. వారిని ఆదుకోవాలని కోరారు.

రాజకీయమా.. రైతుల బాధలా: కృష్ణా రెడ్డి
రాజకీయమా.. రైతుల బాధలా: కృష్ణా రెడ్డి
author img

By

Published : May 15, 2021, 4:43 PM IST

బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​కు హుజూరాబాద్ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదని జిల్లా భాజపా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్​లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాలను, కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.

అధికార పార్టీ నాయకులు పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శుక్రవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడి ధాన్యం తడిసిందని చెప్పారు. మార్కెట్​, ఐకేపీ కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోలు మందకొండిగా సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంగుల జిల్లా మంత్రి అయి ఉండి ఎప్పుడైనా అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను, కొనుగోలు కేంద్రాలను సందర్శించారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ రాజకీయాలపై సమీక్షలు నిర్వహిస్తున్నమంత్రి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగ సమస్యలపై, కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

ముఖ్యంగా 20 రోజులకు పైగా రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి పగలనక రాత్రనక పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. అన్నదాతలు తమ పంటలను కొనుగోలు కేంద్రాలు తీసుకువస్తే ఎప్పుడు కొంటారో తెలియని దుస్థితి నెలకొందని చెప్పారు.

ఇదీ చదవండి: ఎంపీ రఘురామను విచారిస్తున్న సీఐడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.