ETV Bharat / state

మొక్కలు నాటితేనే.. భవిష్యత్తుకు మనుగడ : కరీంనగర్​ కలెక్టర్​

భవిష్యత్తు తరాలు మనుగడలో ఉండాలంటే.. ఇప్పుడు మొక్కలు నాటాలని..కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక అన్నారు. జిల్లాలోని మానకొండూరు మండలం పరిధిలోని ఈదురుగుట్టపల్లిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

Karim Nagar Collector Participated In Harithaharam
మొక్కలు నాటితేనే.. భవిష్యత్తుకు మనుగడ : కరీంనగర్​ కలెక్టర్​
author img

By

Published : Jun 28, 2020, 10:11 AM IST

మొక్కలు విరివిగా నాటి పర్యావరణ సంరక్షణ కు దోహదం చేసినప్పుడే భవిష్యత్తు తరాలకు మనుగడ చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఈదురుగుట్టపల్లిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిట్టడవులు పెరిగేలా శ్రద్ధ తీసుకుంటే.. పర్యావరణ సమతుల్యం కాపాడబడి.. వర్షపాతం పెరుగుతుందని కలెక్టర్​ అన్నారు. కరీంనగర్​లో 55 లక్షల చెట్లను నాటే విధంగా ప్రణాళిక రూపొందించామని సుడా ఛైర్మన్​ జీవీ రామకృష్ణారావు అన్నారు. మొక్కలు నాటి.. బాధ్యతగా వాటిని సంరక్షించాలని సూచించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.