Kangaroo Mother Cares Have In All HospitalS Telangana: తక్కువ బరువుతో జన్మించిన శిశువుల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నమిది. పొట్ట, ఛాతీ భాగంలో గట్టిగా కట్టి కొన్ని గంటలపాటు ఉంచడం ద్వారా శిశువులకు వెచ్చగా ఉండటంతో పాటు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దాంతో తొందరగా బరువు పెరుగుతారు. ఇటీవలి వరకు తల్లులతో మాత్రమే ఈ ప్రయత్నం చేశారు. ఈ విధానాన్ని ‘కంగారూ మదర్ కేర్’ అంటారు.
రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో ఈ విధానం అమలులో ఉంది. అయితే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలోని ఎన్‌ఐసీయూ విభాగంలో తండ్రులతోనూ ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఇది సత్ఫలితాలిస్తోందని పిల్లల వైద్యుడు డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
ఇవీ చదవండి: