ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బత్తిని సుదర్శన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నా బంగారం, బుజ్జి... మందు తీసుకురా తల్లీ!