ETV Bharat / state

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు.. కొమ్ముకాస్తున్న ప్రజాప్రతినిధులు..!

Illegal constructions in Karimnagar: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా నగరపాలికతో పాటు మున్సిపాలిటీల్లో అక్రమ, అనధికారిక, అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరందుకున్నాయి. బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వారు తప్ప మిగతా వారు మాత్రం అనుమతుల కోసం ముందుకు రావడం లేదు. నాలుగైదు నెలలుగా ఇలాంటివి పెరిగిపోతున్నాయని ఆయా ప్రాంతవాసుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు సహించబోమని అధికారులు చెబుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ఓట్లు ఎక్కడ కోల్పోతామో అన్న ఉద్దేశంతో కూల్చివేతల జోలికి వెళ్లనివ్వడం లేదు.

Illegal construction of buildings in Karimnagar
కరీంనగర్‌లో అక్రమంగా భవంతులు నిర్మాణాలు
author img

By

Published : Jan 29, 2023, 10:28 AM IST

Illegal constructions in Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాల జోరు కనిపిస్తోంది. వీటికి తోడు పెంట్‌హౌజ్‌లు విరివిగా నిర్మించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపాల్టీకి మార్టిగేజ్‌ లేకుండా నిర్మాణాలు చేస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు, పార్కింగ్‌ కోసం స్థలం కొంతమేర వదలాల్సి ఉండగా ఈ సెట్‌బ్యాక్‌ ఎక్కడా కనిపించడం లేదు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?: వాస్తవంగా కొత్త భవనాలు నిర్మిస్తే మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం కొంతమేర రోడ్డు వైపు స్థలాన్ని వదలాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్న భవనాలకు అనుమతి పత్రంలోనే సెట్‌బ్యాక్‌ ఎంత వదలాలి అనే విషయం స్పష్టంగా ఉంటుంది. పట్టణ ప్రణాళిక అధికారులు నిర్మాణాలు పూర్తయ్యే వరకు పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతవాసులకు రోడ్లు మరింత ఇరుకుగా మారుతున్నాయి.

ఆన్‌లైన్‌ అనుమతుల వలనే పెరుగుతున్నాయా?: ఆన్‌లైన్‌లో అనుమతి విధానం అమల్లోకి వచ్చాక నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అనే అంశాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రెండేళ్లలో ఒక్క కరీంనగర్‌లోనే 1886 అనుమతులు తీసుకోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 8 వేల వరకు అనుమతులు జారీ అయ్యాయి. ఆన్‌లైన్ విధానం రాక ముందు అక్రమ కట్టడాలు 480 వరకు ఉన్నట్లు తేల్చారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి లేదా కోర్టు ఉత్తర్వులు వస్తే తప్ప కూల్చివేతల వైపు వెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నిర్మాణాలు తొలగిస్తున్నామని చెబుతున్నారు.

చర్యలు తీసుకునేందుకు టాస్క్​ఫోర్స్ కమిటీ ఏర్పాటు: మరో వైపు మున్సిపాలిటీలకు భవన నిర్మాణాలతో వచ్చే ఆదాయం తగ్గుతోంది. కొద్ది నెలలుగా వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. అక్రమ, అనధికారిక అంతస్తులు ఉన్న భవనాలకు ఇప్పటికే కొన్ని నోటీసులు జారీ కాగా తదుపరి చర్యలు తీసుకుంటున్నామని మేయర్ సునీల్‌రావు తెలిపారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత కూల్చివేతలు కొనసాగినప్పటికీ డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో జరగట్లేదని ప్రచారం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలు సహించబోమని అధికారులు చెబుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ఓట్లు ఎక్కడ కోల్పోతామో అన్న ఉద్దేశంతో కూల్చివేతల జోలికి వెళ్లనివ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.

కరీంనగర్‌లో అక్రమంగా భవంతులు నిర్మాణాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.