ETV Bharat / state

కౌశిక్​ రెడ్డి మరో ఆడియో లీక్​... అందులో ఏముందంటే! - తెలంగాణ తాజా వార్తలు

ఒక్క ఫోన్​కాల్​తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హుజూరాబాద్​కు చెందిన నాయకుడు కౌశిక్​ రెడ్డి.. మరో ఆడియో లీకయింది. తాను ఏ తప్పు చేయలేదని.. పార్టీ అధ్యక్షుడే ఓడిపోతామని చెబుతుంటే ఏం చెయ్యాలని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ నాయకుడు తిరుపతికి ఫోన్​ చేశారు. ఈ ఆడియో బయటకొచ్చింది.

padi koushik reddy
padi koushik reddy
author img

By

Published : Jul 13, 2021, 8:33 PM IST

ఒక్క ఫోన్​కాల్​తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హుజూరాబాద్​కు చెందిన కాంగ్రెస్​ మాజీ నేత కౌశిక్​ రెడ్డి.. మరో ఆడియో లీకయింది. తాను ఏ తప్పు చేయలేదని.. పార్టీ అధ్యక్షుడే ఓడిపోతామని చెబుతుంటే ఏమిచెయ్యాలని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ నాయకుడు తిరుపతికి ఫోన్​ చేశారు. ఈ ఆడియో బయటకొచ్చింది.

తాజాగా లీక్‌ అయిన ఆడియో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌ రెడ్డి... హుజూరాబాద్ మండలం కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదంటు... కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి‌ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఉప ఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో తెరాస, భాజపా నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కష్టపడ్డాం.. ఇక సుఖపడే రోజులు వస్తున్నాయి.. సహకరించాలని కోరుతున్నట్లుగా ఆడియోలో ఉంది. తాను స్వయంగా వచ్చి కలుస్తానంటూ హామీ ఇస్తున్నారు.

"నేను చేసింది తప్పేమీ లేదు.. సాక్ష్యాత్తు రాష్ట్ర అధ్యక్షుడే మనం ఓడిపోతామని చెబుతుంటే మనమెట్లా పోటీ చేయాలి... రేవంత్​ రెడ్డి అలా చెప్పినప్పుడు ఇక పోటీ ఏమన్నా ఉంటుందా.. నేనేమి చేయాలి. భాజపా, తెరాస నేతలు రోజూ తిరుగుతున్నారు. నేను రోజు అడిగితే వాళ్లు ఎవ్వరూ రాలేదు. మరి నేనేమి చేయగలను" అని ఆవేదన వ్యక్తం చేశారు.

కలకలం రేపుతున్న కౌశిక్​ రెడ్డి మరో ఆడియో

ఇదీ చూడండి: UTTAM: మాటలే కౌశిక్ రెడ్డివి.. స్క్రిప్ట్ అంతా తెరాసదే..: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.