రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగుల గొంతుకనై... వారి సమస్యలను పరిష్కారం చేయడానికి పోటీ చేస్తున్నట్లు హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తెలిపారు. నిరుద్యోగుల పక్షాన తాను హుజురాబాద్ బరిలో(Huzurabad by election 2021) నిలిచానని ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి నామినేషన్ వేసిన(huzurabad congress candidate balmuri venkat) ఆయన... కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి నాయకుడైన తనకు అవకాశం ఇచ్చిందన్నారు.
అండగా నిలవాలి..
హుజూరాబాద్(huzurabad congress candidate balmuri venkat) ప్రజల సమస్యల పరిష్కారం కోసం నడుం బిగిస్తానని... గ్రామ గ్రామాన తిరిగి ప్రజల మద్దతు కూడగట్టుకుంటానని వెంకట్ తెలిపారు. రెండు పార్టీలు ఏకమై ప్రజల్ని మభ్యపెట్టి... స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థుల పక్షాన పోరాటం చేసిన తనపై ఏడేళ్లలో 24 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెండుసార్లు జైలు జీవితం గడిపానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన పోరాటాన్ని నిలువరించేందుకు ఎముకలు విరగ్గొట్టినా... విద్యార్థి ఉద్యమాల్లో మాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి నాయకుడిని అయిన తనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని... రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు తనకు అండగా నిలవాలని వెంకట్ కోరారు.
ముగిసిన నామినేషన్లు
హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావటంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు రావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. పీసీసీ ఉపాధ్యక్షులు దామోదర రాజనర్సింహ పొన్నం ప్రభాకర్‌తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఈనెల 30 న జరగనుంది.
ఉపఎన్నిక వివరాలిలా...
ఈ నెల 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: Huzurabad By Election 2021: హుజూరాబాద్‌లో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్