ETV Bharat / state

Huzurabad: వాడివేడిగా ఉపఎన్నిక ప్రచారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం - huzurabad by election

హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు ఒకరికి మించి మరొకరు ప్రచారాలు చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఈ ఉపఎన్నిక సెమీఫైనల్‌గా భావిస్తుండటంతో పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం, ధూంధాం కార్యక్రమాలతో ప్రచారం వాడివేడీగా సాగుతోంది.

huzurabad by election
హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం
author img

By

Published : Oct 10, 2021, 5:08 AM IST

తెరాస, భాజపాలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌లో ప్రచారపర్వం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకుని గెలుపు తీరం చేరడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరఫున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఊరూరా తిరుగుతున్నారు. గడప గడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎల్కతుర్తి మండలం పెంచికల పేటలో మహిళలతో సమావేశం నిర్వహించారు. అనంతరం బుజునూరులో ధూంధాంలో పాల్గొన్న హరీశ్‌ కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ పార్టీ వచ్చినప్పటి నుంచే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. పెట్రోల్ ధర, గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు.

పథకాలు బంద్ చేస్తామని బెదిరిస్తున్నారు: ఈటల

తెరాసకు ఓటు వేయకపోతే పథకాలు బంద్‌ అవుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాదన్నపేట, గునపర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. ఆయన సతీమణి ఈటల జమున కమలాపూర్ మండలంలో ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కేసీఆర్ సొమ్ముతో ఇవ్వడం లేదని మనం చెల్లించే పన్నుల నుంచే ఇస్తున్నారని ఈటల తెలిపారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడించేందుకు ప్రణాళిక, ప్రచారంలో జనంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలు సహా అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు గాంధీభవన్‌లో చర్చించారు. అనంతరం మండలాలవారీగా ఇంఛార్జ్‌లను, సమన్వయకర్తలను నియమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అమలులో ఉంటుందని, జిల్లా మొత్తం కోడ్ అమలులో ఉండదని తెలిపారు.

ఇదీ చూడండి: Harish Rao Comments: 'నల్లచట్టాలను రద్దు చేయాలన్న ఈటల... యూటర్న్ తీసుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.