కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించారు. హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. హోమంలో భాగంగా భారతీ స్వామిజీ పూర్ణాహుతి నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఇదీ చూడండి : జలసంకల్ప యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు