కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో అక్రమంగా నడిపిస్తున్న బెల్టు దుకాణాలపై పాలకవర్గం కొరడా ఝుళిపించింది. సర్పంచ్ వీర్ల సరోజన ఆధ్వర్యంలో బెల్టు దుకాణాలను గ్రామస్థులు తనిఖీ చేశారు. స్థానికంగా ప్రభుత్వ అనుమతి లేకున్నా మద్యం విక్రయించే దుకాణదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరపవద్దని హెచ్చరించారు. మద్యం అక్రమ నిలువలను ద్వసం చేశారు. మద్యం అక్రమ విక్రయాలపై పంచాయతీ వార్డు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్టు దుకాణాలు నడపవద్దని ఇటీవలే పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఆ మేరకు మద్యం అక్రమ విక్రయాలు జరపవద్దని పాలకవర్గ సభ్యులు దుకాణాదారులను హెచ్చరించారు.
వెలిచాల బెల్టు షాపులపై పాలకవర్గం దాడులు - వెలిచాల బెల్టు షాపులపై పాలకవర్గం దాడులు
తమ ఊర్లో బెల్టు దుకాణాలు నడపొద్దని కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. అక్కడితోనే ఆగిపోకుండా... అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్న దుకాణాలపై దాడులు చేసింది. మద్యం సీసాలను ద్వసం చేసి... దుకాణాదారులను హెచ్చరించింది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో అక్రమంగా నడిపిస్తున్న బెల్టు దుకాణాలపై పాలకవర్గం కొరడా ఝుళిపించింది. సర్పంచ్ వీర్ల సరోజన ఆధ్వర్యంలో బెల్టు దుకాణాలను గ్రామస్థులు తనిఖీ చేశారు. స్థానికంగా ప్రభుత్వ అనుమతి లేకున్నా మద్యం విక్రయించే దుకాణదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరపవద్దని హెచ్చరించారు. మద్యం అక్రమ నిలువలను ద్వసం చేశారు. మద్యం అక్రమ విక్రయాలపై పంచాయతీ వార్డు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్టు దుకాణాలు నడపవద్దని ఇటీవలే పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఆ మేరకు మద్యం అక్రమ విక్రయాలు జరపవద్దని పాలకవర్గ సభ్యులు దుకాణాదారులను హెచ్చరించారు.
TAGGED:
BELT SHOPS BAN IN VELICHALA