వాతావరణ మార్పులు, చీడపీడలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేశారు. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించిన తెదేపా నాయకులు... రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే రైతులు సన్నరకం ధాన్యం వేశారని పేర్కొన్నారు.
చీడపీడల కారణంగా రైతులు అన్ని రకాలుగా నష్టపోయారని ప్రభుత్వం బీమా చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. దొడ్డురకం ధాన్యం వర్షం కారణంగా నల్లగా మారిపోవడమే కాకుండా తేమ కూడా అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. నాణ్యత ప్రమాణాలను సడలించి ధాన్యం కొనుగోలు చేయాలంటున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.