కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ను సీపీఎం నాయకులు సందర్శించారు. హాస్పిటల్ లో మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రోగ నిర్ధరణ కేంద్రం నిర్మించి సంవత్సరంపైగా గడిచినా ఇప్పటివరకు ప్రారంభించలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్విప్మెంట్ ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
హాస్పిటల్ సిబ్బంది కరోనా బారిన పడుతున్న పరిస్థితుల్లో వారికి ఇన్సెంటివ్ కాకుండా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేశ్, శనిగరపు రజినీకాంత్, నాయకులు పుల్లెల మల్లయ్య, శ్రీకాంత్, రాకేశ్, సురేశ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.