ETV Bharat / state

MLA Helps to Bridegroom : 'బైక్​' కోసం ఆగిన పెళ్లి.. MLA సాయంతో ఒక్కటైన జంట - కరీంనగర్​లో బైక్ కొనివ్వలేదని పెళ్లిన ఆపిన వరుడు

MLA Helps to Bridegroom in Karimnagar : మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు పెళ్లి కుమార్తె తరఫు బంధువులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి కుమారుడు సైతం కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అందరూ విందు వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో వరుడు ఆశ్చర్యపోయే ట్విస్ట్ ఇచ్చాడు. దానికి ఓకే అయితేనే తాళి కడతానని మొండికేశాడు. ఏం చేయాలో అర్థం కాని పెళ్లి కుమార్తె కన్నీరు పెట్టింది. అదే సమయంలో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సాయంతో వారిద్దరు ఒక్కటయ్యారు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

MLA
MLA
author img

By

Published : May 13, 2023, 8:52 AM IST

MLA Helps to Bridegroom in Karimnagar : సాధారణంగా పెళ్లికి ముందు కట్నం తక్కువ ఇచ్చారనో, కుటుంబ సమస్యల వల్లనో, ప్రేమ వ్యవహారాల కారణంగానో లగ్గానికి ముందు వివాహాలు ఆగిపోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అంతా ఓకే అనుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకొని కల్యాణ మండపంలో వివాహ వేడుకకు సిద్దమయ్యారు. తీరా తాళి కట్టే సమయానికి వరుడు పెట్టిన కండిషన్​తో అంతా ఆశ్చర్యపోయారు. దానికి ఓకే చెబితేనే పుస్తె కడతానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఎదురుగా కూర్చున్న పెళ్లి కుమార్తె కన్నీళ్లు పెట్టింది. అదే సమయానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెళ్లి మధ్యలో అలా జరగడం చూసి చలించిపోయారు. వెంటనే వివాహం ఆగడానికి గల కారణాలు తెలుసుకొని కావాల్సిన సహాయం చేసి పెళ్లి జరిపించిన సంఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాల్‌పూర్‌ గ్రామ మాజీ సర్పంచి గాజుల లచ్చమ్మ-మల్లయ్య దంపతుల కుమార్తె అనూషకు సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంగాల వినయ్‌తో లాంఛనాలు, కానుకలు ఒప్పందం చేసుకొని పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. కట్నం కింద రూ.5 లక్షలతో పాటు బైక్ ఒప్పుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికీ అప్పోసప్పో చేసి పెళ్లికి ముందే రూ.5 లక్షలు ముట్ట జెప్పారు. తీరా శుక్రవారం కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్​లో వివాహ సమయంలో వరుడు వినయ్‌ ద్విచక్ర వాహనం కోసం వధువు తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. వాహనం ఇస్తేనే తాళి కడతానని భీష్మించుకొని కూర్చున్నాడు.

ఎమ్మెల్యే సహాయంతో ఒక్కటైన జంట: అదే సమయంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పెళ్లి కుమారుడు వినయ్‌కు నచ్చజెప్పారు. వరుడికి బైక్‌ కొనివ్వడానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వధువు అనూషను ఎమ్మెల్యే ఓదార్చి రూ.50 వేల నగదు ఆమె చేతుల మీదుగా వరుడికి ఇప్పించారు. మిగతా డబ్బు వాహన షోరూంలో తానే చెల్లిస్తానని వరుడికి చెప్పారు. అనంతరం వివాహం జరిగింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ.. పెళ్లి కుమార్తెది పేద కుటుంబమని, పందిట్లో గొడవతో పెళ్లి ఆగడంతో ఆర్థిక సాయం చేశానని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.