కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. కోతిరాంపూర్ హనుమాన్‌నగర్‌లో 200 మంది సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన అనుమతి పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాట్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. 45 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కాలనీ వాసులను అభినందించారు.
ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ